చార్మినార్ దగ్గర సందడి చేసిన కైరా

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్‌ నటి కైరా అద్వానీ. భరత్‌ అనే నేను చిత్రంహిట్‌ కావడంతో ఇప్పుడు కైరా, రామ్ చరణ్, బోయపాటి చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతోంది. ఈ ప్రాజెక్టు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

ఇక ఈ రోజు సెలవు కావడంతో తన బృందంతో కలిసి చార్మినార్ దగ్గర షాపింగ్ చేసి, ఐస్ క్రీం లాగిచ్చేసింది. అక్కడ రోడ్ మీద దొరికే ఆభరణాలను సైతం సెలబ్రిటీ అనే ఫీలింగ్ లేకుండా కొనేసుకుంది. దాదాపు ఆ పరిసర ప్రాంతాల్లో రెండు గంటల పాటు సందడి చేసింది. కైరా తాజాగానే లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.