త్రివిక్రమ్ డుమ్మా కొట్టేసాడు!

సినిమా ఇండస్ట్రీ లో ఒక ఫ్లాప్ తన జీవితాన్నే మార్చేస్తుంది అన్న దానికి త్రివిక్రమ్ నిదర్శనం అని చెప్పవచ్చు. ఒక టాప్ డైరెక్టర్ కు ప్లాప్ వస్తే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే త్రివిక్రమ్ కు అర్ధం అయ్యి ఉంటుంది. సాగినన్ని రోజులు భాగానే ఉంటాయి. ఏదైనా తేడా వస్తేనే మొదటికే మోసం వస్తుంది. అజ్ఞాతవాసి లాంటి భారీ ఫ్లాప్ తరువాత త్రివిక్రమ్ పరిస్థితి తల కిందులు అయిందని చెప్పవచ్చు. అజ్ఞాతవాసి తరువాత పవన్ తో కలిసిన త్రివిక్రమ్ ఎవరికీ కనిపించలేదు. లేటెస్ట్ గా త్రివిక్రమ్-పవన్ నిర్మాణ భాగస్వాములుగా, త్రివిక్రమ్ కథతో నిర్మాణమైన ఛల్ మోహన్ రంగ సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది.ఈ ఫంక్షన్ కు త్రివిక్రమ్-పవన్ ఇద్దరూ హాజరవుతారని ప్రచారం జరిగింది. పైగా దర్శకుడు కృష్ణ చైతన్య ప్రస్తుతం త్రివిక్రమ్ క్యాంప్ లో వున్నారు. త్రివిక్రమ్ గీసిన గీతకు లోపలే వుంటున్నారని టాక్. తన శిష్యుడి సినిమా, తన కథతో తయారైన సినిమా, తన నిర్మాణ భాగస్వామ్యంతో వస్తున్న సినిమా ఆడియో ఫంక్షన్ కు డుమ్మా కోట్టేసారు త్రివిక్రమ్. పవన్ వచ్చే సినిమా ఫంక్షన్లకు త్రివిక్రమ్ కూడా రావడం అన్నది చాలా కాలంగా టాలీవుడ్ లో కామన్. అలాంటిది పవన్ తో కలిసి రావాల్సిన ఫంక్షన్ కు త్రివిక్రమ్ రాలేదు. అదన్నమాట మేటర్.