త్రిష ధైర్య, సాహసాలు

ఇండస్ర్టీ లో అడుగు పెట్టి 15 సంతవత్సరాలకుపైగా అవుతున్న ఇప్పటీ రాణిస్తోంది నటి త్రిష. తెలుగులో మన స్టార్‌ హీరోల పక్కన అడిపాడిన త్రిష ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం వైపు మొగ్గు చూపుతోంది. తాజాగా ఈమె నటిస్తున్న మోహిని త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. త్రిష విదేశీయానానికి తరుచూ వెళ్లొస్తుంటారు. చేతి నిండా చిత్రాలు ఉన్నా, పార్టీలు, పబ్‌లు అంటూ జీవితాన్ని ఎంజాయ్‌ చేసే నటి త్రిష. ఈమె ప్రస్తుతం కెనడాలో ఎంజాయ్‌ చేస్తోంది. త్రిషకు కాస్త ధైర్యం ఎక్కువేనని చెప్పకోకతప్పదు. సినిమాల్లో హీరోలు బంగీ జంపు చేస్తుండడం చూస్తుంటాం. అందుకు వారు పలు జాగ్రత్తలు తీసుకుంటారు.

ఇప్పుడు నిజంగానే అలాంటి సాహసమే చేసింది త్రిష. 1,168 అడుగుల ఎత్తైన బిల్డింగ్‌ అంచున రోప్‌ సాయంతో 10 నిమిషాలు నిలబడి ఆ దృశ్యాలను ఫొటో తీసుకుని వాటిని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోలిప్పుడు సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అయి అభిమానుల్ని విపరీతంగా అలరిస్తున్నాయి. త్రిష ధైర్య, సాహసాల గురించి వారు ఒక రేంజ్‌లో పొగిడేస్తున్నారు. ఈ విధంగా త్రిష మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈమె గర్జన, 96, చతురంగవేట్టై–2, పరమపదం, 1818 చిత్రాల్లోను నటిస్తున్నారు.