HomeTelugu TrendingVishwambhara: చిరంజీవి 'విశ్వంభర'లో దేవకన్యగా మీనాక్షి చౌదరి?

Vishwambhara: చిరంజీవి ‘విశ్వంభర’లో దేవకన్యగా మీనాక్షి చౌదరి?

chiranjeevi

Vishwambhara: యంగ్‌ హీరోయిన్‌ మీనాక్షి చౌదరికి వరుస అవకాశలు వస్తున్నాయి. ‘హిట్’ .. ‘ఖిలాడీ’ సినిమాల్లో తరువాత ఆమె తాజాగా ‘గుంటూరు కారం’లో మెరిసింది. ఈ సినిమాలో ఆమె మహేశ్ బాబు మరదలిగా నటించింది.ఈ సినిమాలో ఆమె పాత్రకి పెద్ద ప్రధాన్యత లేకపోయిన స్ర్కీన్‌పై అందంగా కనిపించి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ.

తాజాగా ఈ అమ్మడుకి మెగా ఛాన్స్‌ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా శ్రీవశిష్ఠ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సోషియో ఫాంటసీ జోనర్ లో సాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌ ఉండనున్నట్లు టాక్‌. ఆ ముగ్గురులో మెయిన్‌ హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు త్రిష సెట్‌లో ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా కోసం ఓ స‌రికొత్త లోకాన్ని సృష్టించ‌బోతున్నారు. ఆలోకంలో దేవ‌క‌న్య‌గా మీనాక్షి క‌నిపించబోతోంద‌ని టాక్‌. మరి దీనిలో నిజమెంత ఉందో చూడాలి. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu