దిల్ రాజు చేతిలో నాని సినిమా!

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసి ఏప్రిల్ లో సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. ఈ నేపధ్యంలో దిల్ రాజు ఈ చిత్రం రైట్స్ ని సొంతం చేసుకున్నారు.
వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టించిన ‘తొలి ప్రేమ‌’ తెలుగు రాష్ట్రాల హ‌క్కులు 18 కోట్ల‌కు హోల్‌సేల్‌గా కొని భారీగానే లాభాలను ఆర్జించాడు. తాజాగా నాని ‘కృష్ణార్జున యుద్ధం’ తెలుగు రాష్ట్రాల రిలీజ్ హ‌క్కుల్ని దిల్‌రాజు గంప‌గుత్త‌గా ఛేజిక్కించుకున్నార‌ని తెలుస్తోంది. థియేట్రిక‌ల్ రైట్స్‌, శాటిలైట్‌- డిజిట‌ల్ రైట్స్ కోసం రూ.21 కోట్లు చెల్లించార‌ట‌.  సినిమా ఓవ‌ర్సీస్ హ‌క్కులు 4-5 కోట్ల మేర ప‌లికే అవ‌కాశం ఉంది. దిల్ రాజు ఈ సినిమా రైట్స్ దక్కించుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.