శృతిహాసన్ పై హీరో ఫైర్!

దక్షిణాది స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఈ మధ్య వివాదాల్లో బాగా చిక్కుకుంటోంది. తన ప్రవర్తన కారణంగా అందరిని ఇబ్బంది పెడుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ‘ఊపిరి’ సినిమాలో హీరోయిన్ గా ముందుగా శృతిహాసన్ అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో నిర్మాతకు ఆమెకు మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. అలానే తమిళ ‘సంఘమిత్ర’ ప్రాజెక్ట్ లో మొదట నటించడానికి అంగీకరించింది. పాత్రకు తగ్గ కసరత్తులు కూడా చేసింది. సినిమా ప్రారంభోత్సవ వేడుకలో సైతం పాల్గొంది. కానీ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ లేదంటూ పక్కకు తప్పుకుంది. దీంతో దర్శకుడు సుందర్, ఖుష్బూలు శృతి ప్రవర్తనతో బాధ పడ్డారు.
ఇలా చెప్పుకుంటే.. చాలానే ఉన్నాయి. తాజాగా జగ్గేష్ అనే కన్నడ హీరో శ్రుతిని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు. మేకప్ లేకుండా శృతిహాసన్ ను చూడడం చాలా కష్టమని ఆమె కంటే కన్నడ ఇండస్ట్రీలో అందంగా ఉండే వారు చాలా మంది ఉన్నారని, వారందరినీ కాదని శృతిహాసన్ లాంటి గర్వమున్న వ్యక్తి వెంట దర్శకనిర్మాతలు పడడం తగదని అన్నారు. జగ్గేష్ ఈ విధంగా మాట్లాడడం వెనుక ఓ కారణం ఉంది. ఇటీవల ఓ కన్నడ యువ హీరో సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించనుందనే వార్తలు వినిపించాయి. దీంతో రియాక్ట్ అయిన శృతి కన్నడ సినిమాల్లో నటించే చాన్సే లేదని చెప్పుకొచ్చింది. దాన్ని అవమానంగా భావించిన జగ్గేష్ ఈ విధంగా ఆమెను విమర్శించారు.