దిల్ రాజు ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా వరుస సినిమాలో చేస్తోన్న దిల్ రాజు ఇప్పుడు టోటల్ సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెంచాడు. తెలుగు, తమిళ్ హీరోస్ తో ఓ మల్టిస్టారర్ మూవీని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే మొన్న కమల్ హాసన్ తో శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2 అనే భారీ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేశాడు. కానీ తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మరో బడా దర్శకుడిపై కన్నేశాడు దిల్ రాజు. ప్రజెంట్ ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మణిరత్నం దర్శకత్వంలో ఓ మెగా మూవీ ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు. ఈ మూవీతో టోటల్ సౌత్ లో పాపులర్ అవ్వాలనేది దిల్ రాజు ప్లాన్.
ఇదొక మల్టీస్టారర్ మూవీగా తెలుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన యంగ్ హీరోస్ ఈ సినిమాలో నటిస్తారని టాక్. ఈ సినిమాలో మెగా హీరోల్లో ఒకర్ని తీసుకోవాలని దిల్ రాజు భావిస్తున్నట్టు సమాచారం. ఒప్పుకుంటే చరణ్, లేదంటే వరుణ్ ను తీసుకోవాలనేది ఈ నిర్మాత ఆలోచనట. కోలీవుడ్ నుంచి హీరోగా ఎవర్ని తీసుకుంటారనేది మణిరత్నం నిర్ణయానికే వదిలేసినట్టు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!