పంతం మూవీ ట్రైలర్

టాలీవుడ్‌ హీరో గోపీచంద్‌ మరో యాక్షన్‌ డ్రామా ‘పంతం’తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం కే చక్రవర్తి డైరెక్షన్‌లో రూపోందుతోంది. ఈ చిత్రంలో మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

 

రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎలిమెంట్లతోనే ట్రైలర్‌ను కట్‌ చేశారు. పంతంలో గోపిచంద్ వెంట పడే అమ్మాయి పాత్రలో మెహ్రీన్ కనిపిస్తోంది. ఇక హీరో అజ్ఞాతంలో ఉండి అందరికీ మేలు చేయడానికి, రాబిన్‌హుడ్‌లా పెద్ద వాళ్లను దోచి పేదలకు పెట్టడానికి ఒక బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఇలాంటి సినిమాల్లో. పంతంలో కూడా అలాంటి ఛాయలు కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా పాత సినిమాలనే గుర్తు చేస్తున్నా… ఎమోషనల్‌గా, స్టైలిష్ గా కనిపిస్తోంది ‘పంతం’ సేఫ్ జోన్లో, పడికట్టు ఫార్ములాలో రూపొందినట్టుగా అనిపిస్తున్న ఈ సినిమా హిట్ గోపిచంద్‌కు చాలా కీలకం. గోపీ సుందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ చిత్రం శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్‌ నిర్మించారు. జూలైలో పంతం ప్రేక్షకుల ముందుకు రానుంది.