విడాకుల పై స్పందించిన రేణూ

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ విడాకులు కావాలన్నారని, అందుకే విడాకులు తీసుకున్నామని తెలిపారు రేణూదేశాయ్. తన పర్సనల్‌ యుట్యూబ్‌ చానల్‌లో రిలీజ్‌ చేసిన ఇంటర్య్వూలో ఇన్నేళ్లు ఒంటరిగా సాగిన తన ప్రయాణం, ఎదుర్కొన్న కష్ట నష్టాలతో పాటు పవన్‌తో విడాకులకు కారణమైన పరిణామాలపై స్పందించారు ఇంతకాలం చాలా ఇంటర్య్వూస్‌ లో ఈ ప్రశ్న ఎదురైనా నేను ఎక్కడా సమాధానం చెప్పలేదు. కానీ ఇప్పుడు నాకు మరొకరితో పెళ్ళి ఫిక్స్‌ అయింది. కనుక చెప్పవచ్చని అనుకుంటున్నాను

పవన్‌ కల్యానే ముందు విడాకులు కావాలన్నారని, అందుకే విడాకులు తీసుకున్నామని తెలిపారు. అయితే ఇన్నేళ్లు ఇంటి విషయాలన్ని బయటపెట్టి గోల చేయకూడదన్న ఉద్దేశంతో స్పందించలేదన్న రేణూ.. ఇప్పుడు మరో ఇంటికి కోడలిగా వెళుతున్న తరుణంలో ప్రజలకు, అభిమానులకు క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే స్పందిస్తున్నానన్నారు.