ఆదిపురుష్‌: ‘రాం సీతా రాం’ వీడియో సాంగ్‌ విడుదల

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆది పురుష్’. ఈ సినిమా జూన్ 16న విడుదల కానుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతీ సనన్ సీత పాత్ర పోషించింది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ లో జోరు పెంచింది. టీజర్, ట్రైలర్, పోస్టర్స్‌తో పాటు వరుసగా పాటలు వదులుతోంది. ఈ క్రమంలో ఈ రోజు సినిమా నుంచి.. ‘రాం సీతా రాం’ వీడియో పాటను విడుదల చేసింది.

‘నువ్వు రాజకుమారివి జానకి.. నువ్వు ఉండాల్సింది రాజభవనంలో’ అని సీత పాత్రధారి కృతీ సనన్‌కు ప్రభాస్ చెబితే.. ‘నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం.. మీ నీడైనా మిమ్మల్ని వదిలివెళ్తుందేమో.. ఈ జానకి వెళ్లదు’ అని ఆమె బదులిస్తుంది. ‘ఆదియు అంతము రాముడిలోనే.. మా అనుబంధం రాముడితోనే’ అంటూ మొదలైన పాటలో రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం, మంచి విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

వనవాసానికి వచ్చిన సమయంలో రాముడు, సీత ఒకరినొకరు అర్థం చేసుకున్న విధానం, సీతను రావణాసురుడు ఎత్తుకెళ్లిన తర్వాత ఇద్దరూ పడ్డ మథనాన్నిదర్శకుడు అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్ర పోషించారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates