పవన్ @తోటరాముడు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పనక్కర్లేదు. పవన్ అభిమానులు ఆయన్ని ముద్దుగా పవర్ స్టార్ అని పిలుచుకుంటుంటారు. ఇంట్లో పవన్ ను కళ్యాణ్ బాబు అని పిలుచుకుంటారు. ఇవి కాకుండా పవన్ కు మరో ముద్దు పేరు కూడా ఉందండోయ్.. అదేంటంటే తోటరాముడు. ఇదేదో పాత సినిమా టైటిల్ లా ఉందేంటి అనుకుంటున్నారా..?కానీ నిజంగానే పవన్ ముద్దు పేరు ఇదే. పైగా ఈ పేరు పెట్టింది అతడి అన్నయ్య నాగబాబు. ఈ విషయాన్ని నాగబాబు స్వయంగా వెల్లడించారు. ఆ పేరు ఎందుకు పెట్టారో కూడా వివరించారు. పవన్ సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు తన ఫామ్ హౌస్ లో పొలం పని చేస్తూ రైతుగా కనిపిస్తుంటాడు. అవి చూసే పవన్ కు ఈ పేరు పెట్టినట్లు స్పష్టం చేసాడు. సాదరంగా హీరోలు ఎవరైనా సినిమా సినిమాకు గ్యాప్ వస్తే స్క్రిప్ట్ చదువుతారు. కానీ వీడు మాత్రం తోటపని, వ్యవసాయం చేస్తుంటాడని అన్నారు.