పవన్ ఫోటోషూట్!

రాజకీయాలలోకి వచ్చి చాలాకాలం మౌనంగా ఉండి ఈమధ్యనే తన రాజకీయ ఎత్తుగడల వేగం పెంచిన పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫోటో షూట్ కు సబంధించిన ఫోటోలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. గతంలో మెగా స్టార్ చిరంజీవి రాజకీయ నాయకుడుగా మారినప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన ఫోటో షూట్ చేయించుకుని ఆ ఫోటోలను విరివిగా తన ప్రచార ఫ్లేక్సీలలో వాడిన విషయం తెలిసిందే.ఇప్పుడు పవన్ కూడ అదేవిధానాన్ని అనుసరిస్తూ మార్చి 14న జరగబోతున్న తన ‘జనసేన’ ప్లీనరీ సమావేసాల కోసం ఒక ప్రత్యేకమైన ఫోటో షూట్ ను తన ట్రేడ్ మార్క్ కుర్తా పైజమాతో ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ముంబై నుండి వచ్చిన ఓ ప్రొఫిషనల్ ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోషూట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా పవన్ అతి త్వరలో మళ్ళీ మీడియా ముందుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.