‘బ్లాక్‌ పాంథర్‌’ కు సీక్వెల్!

80 శాతం మంది నల్ల జాతియులే నటించిన ‘బ్లాక్‌ పాంథర్‌’ అమెరికా బాక్సాఫీస్ ని షేక్ చేస్తొంది. హాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్‌ స్టూడియోస్‌ రూపొందించిన చిత్రం ‘బ్లాక్‌ పాంథర్‌’. షాడ్విక్‌ బోస్‌మ్యాన్‌, మైకేల్‌ బి. జోర్డాన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. రాన్‌‌ కూగ్లర్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా విడుదలైన 26 రోజుల్లో మొత్తం రూ.6,500 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మించిన చిత్రాల్లో ఈ మైలురాయిని దాటిన ఐదో చిత్రమిది.
రూ.1,300 కోట్ల బడ్జెట్‌తో ‘బ్లాక్‌ పాంథర్’ ను తెరకెక్కించారు. అమెరికన్‌ ‘సూపర్‌ హీరో’ స్‌ సినిమాలోని మార్వెల్‌ కామిక్స్‌ పాత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రపంచవ్యాపంగా వాల్‌డిస్నీ స్టూడియోస్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ ను రూపొందించే ఆలోచనలో ఉన్నారు. మార్వేల్ స్టూడియోస్ వారు డిస్నీ సంస్థతో కలిసి సీక్వెల్ ను రూపొందించనున్నారు.