మహేశ్‌బాబు సినిమా రీలిజ్‌ డేట్‌ కన్ఫర్మ్

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు అభిమానులకు శుభవార్త చెప్పారు. ఆయన 25వ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఈ రోజు (మంగళవారం) ప్రకటించింది. వచ్చే సంత్సరం ఏప్రిల్‌ 5న ఉగాది సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ పండుగ మరింత ప్రత్యేకం కాబోతోందని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ డెహ్రాడూన్‌లో జరుపుకొంటుంది.

ఈ మూవీలో పూజా హెగ్డే కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. కాగా అల్లరి నరేశ్‌‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. ఇందులో మహేశ్‌-నరేశ్‌‌ స్నేహితులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. రైతు ఆత్మహత్యల నేపథ్యంలో సినిమా కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా ఈ సినిమాకు టైటిల్‌ ఖరారు చేయలేదు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.’భరత్‌ అనే నేను’ హిట్‌ తర్వాత మహేశ్‌ నటిస్తున్న సినిమా ఇది. ‘ఊపిరి’ విజయం తర్వాత వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రమిది.