మాల్దీవుల్లో మ్యారేజ్‌ డే

యాంకరింగ్‌లో రాణిస్తునే..నటిగా వెండితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ. ఆమె ప్రస్తుతం తన భర్త శశాంక్‌తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇవాళ వారి వివాహ వార్షికోత్సవమట. ఈ సందర్భంగా తన భర్త స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారని అనసూయ ట్వీట్ చేశారు.

నా ఉత్తమ భాగస్వామి శశాంక్‌ మరోసారి నన్ను సర్‌ప్రైజ్ చేశారు. ఈ ఏడాది మాల్దీవులకు తీసుకొచ్చారు అని అనసూయ పేర్కొన్నారు. ఇద్దరి మధ్య అమితమైన ప్రేమ ఉందని చెప్పారు. ఉత్తమ సర్‌ప్రైజ్‌ ప్లానర్‌, భర్త లక్ష్యాలు, 2018లో వివాహ వార్షికోత్సవ ట్రిప్‌, ఆయన్ను నాకిచ్చినందుకు ధన్యవాదాలు దేవుడా!.. అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు. మాల్ధీవుల్లోని బీచ్‌ తీరంలో తన భర్తతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు.

ఇదే సందర్భంగా అనసూయ స్నేహితురాలు, యాంకర్‌ రష్మి ఆమెకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. అందమైన జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. మీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మీ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేయండి అంటూ దంపతుల ఫోటోను పోస్ట్‌ చేశారు.