రజనీ సినిమాతో మహేష్ థియేటర్స్‌ ప్రారంభం!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు స్థిరమైన ఆదాయ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ బిజినెస్ రంగంలో దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మహేష్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏరియాలో ఏఎమ్బి పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్ ను ఏర్పాటు చేశారు. అమీర్, అమితాబ్ ల థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాతో థియేటర్స్ ను ఓపెన్ చేయాలి అనుకుంటే సాధ్యపడలేదు. అమీర్ లేదా అమితాబ్ లు హైదరాబాద్ వచ్చి థగ్స్ ప్రమోట్ చేస్తారేమో ఆ సమయంలో ఈ థియేటర్స్ ను ఓపెన్ చేయిస్తే బాగుంటుందని అనుకున్నారు.

ఇప్పుడు రజినీకాంత్ 2 .0 సినిమాతో ఏఎంబి మల్టీప్లెక్స్ థియేటర్స్ ను ఓపెన్ చేయాలని మహేష్ అనుకుంటున్నట్టు సమాచారం. 2.0 సినిమాకు భారీ హైప్ రావడంతో సినిమాపై ఆసక్తి నెలకొన్నది. పైగా ఈ సినిమాను 2డి తో పాటు 3డిలో కూడా రిలీజ్ చేస్తున్నారు. 2 .0 ప్రమోషన్స్ కోసం రజినీకాంత్, అక్షయ్, శంకర్, రెహ్మాన్ లు హైదరాబాద్ వస్తారు కాబట్టి.. ఆ సమయంలో థియేటర్స్ ను ఓపెన్ చేయించాలని మహేష్ అనుకుంటున్నట్టు సమాచారం.