మెగాస్టార్ తో సిఎం కూతురు!

chiruతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు అభిమాన నటుడు చిరంజీవి. గతంలో ఆమె ఈ విషయాన్ని కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అయితే తాజాగా తన అభిమాన నటుడితో ఫోటో దిగి ఫ్యాన్ మూమెంట్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అసలు విషయానికొస్తే.. రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు చిరంజీవి. అలానే తెలంగాణ రాష్ట్ర సమితి నుండి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు కవిత. ఉపరాష్ట్రపతి ఎన్నికల సంధర్భంగా.. చిరంజీవిని కలిసిన కవిత ఆయనతో ఓ ఫోటో తీసుకుంది. ఆ ఫోటోను ‘ఫ్యాన్ మూమెంట్’ అంటూ 
ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. 
దీన్నిబట్టి మరోసారి రాజకీయం రాజకీయమే, అభిమానం అభిమానమే అని ప్రూవ్ అయింది. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, కెసీఆర్ కొడుకు కెటీఆర్ కూడా మంచి స్నేహితులు. రామ్ చరణ్ నటించిన ‘దృవ’ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో తెలంగాణ మంత్రి కెటీఆర్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కెటీఆర్ స్నేహితుడు ఓ సినిమా చేస్తే ఆ సినిమా ఈవెంట్ కు రామ్ చరణ్ ను అతిథిగా తీసుకొచ్చాడు కెటీఆర్. ఆ ఫంక్షన్ లో వారిద్దరు ఎంతో సన్నిహితంగా మెలిగారు. ఇప్పుడు కెటీఆర్ సోదరి కవిత, చిరంజీవితో ఫోటో తీసుకొని ఓ అభిమానిగా ఆనందం పొందడం గమనార్హం.