శాతకర్ణిలో శివరాజ్ కుమార్ రోల్!

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా వినిపిస్తోన్న పేర్లలో ఇదొకటి. బాలయ్య వందవ సినిమా కావడం, మన తెలుగు జాతి చరిత్రకు చెందిన సినిమా కావడంతో మొదటి నుండి సినిమాపై హైప్ క్రియేట్ అయింది. బాలీవుడ్ తారలతో పాటు సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటించారు. ఆయన ఈ సినిమాలో నటిస్తున్నప్పటి దగ్గర నుండి ఆయన రోల్ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఈ సినిమాలో ఆయన ఓ బుర్రకథలో కనిపించబోతున్నట్లు సమాచారం. ‘శాతకర్ణి’ శౌర్య పరాక్రమాలు, త్యాగనిరతిని గురించి ప్రస్తావిస్తూ ఈ బుర్ర కథ కొనసాగుతుంది. ఆ పాటలో శివరాజ్ కుమార్ కనిపించనుండడం విశేషమనే చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ పట్ల ఆయనకున్న గౌరవడం, బాలకృష్ణ, క్రిష్ లపై ఆయనకున్న అభిమానమే దీనికి కారణమని చెబుతున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.