రజిని క్రేజ్ అలాంటిది!

సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్ నటించిన ‘కాలా’లో క‌నిపించినందుకు మ‌ణి అనే కుక్క‌కి భారీ డిమాండ్ ఏర్ప‌డింది. రెండు నుండి మూడు కోట్లు అయిన ఇచ్చి మ‌ణిని ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్నార‌ని సమాచారం. ముఖ్యంగా రజనీ అభిమానులు ఎంత రేటైనా పెట్టి ఆ కుక్కను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ర‌జినీకాంత్‌తో చాలా రోజుల పాటు షూట్‌లో పాల్గొన్న ఈ కుక్క అంటే ర‌జినీకాంత్‌కి కూడా చాలా ఇష్ట‌మ‌ట‌.దాని కోసం ప్ర‌త్యేకంగా బిస్కెట్స్ కూడా తెచ్చేవారటని మీడియాలో వార్తలు రావటంతో ఈ కుక్కపై క్రేజ్ రెట్టింపు అయ్యింది.’కాలా’ సినిమా కోసం 30 కుక్క‌ల‌ని ప‌రిశీలించిన త‌ర్వాత చివ‌రికి మ‌ణిని సెల‌క్ట్ చేశాడ‌ట ద‌ర్శ‌కుడు పా.రంజిత్. ప్ర‌స్తుతం కుక్క వ‌య‌స్సు రెండు సంవ‌త్స‌రాల ఆరు నెల‌లు కాగా, ప‌లు సినిమాల‌లో న‌టించింది మ‌ణి అనే కుక్క‌. మెహిందీ స‌ర్క‌స్‌, సిమ‌న్ క్లైమ్స్ అనే చిత్రాల‌లోను మ‌ణిని మ‌నం చూడొచ్చు.