‘విజేత’ మూవీకి క్లీన్‌ యు సర్టిఫికెట్‌

మెగాస్టార్‌ చిన్నఅల్లుడు కల్యాణే దేవ్‌ హీరోగా పరిచయమౌతున్న చిత్రం ‘విజేత’. రాకేశ్‌ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఈ రోజు ఈ మూవీ సెన్సార్‌ కార్యక్రమాలు ముగించుకుంది. ఒక్క కట్‌ లేకుండా క్లీన్‌ యు సర్టిఫికెట్‌ ఈ చిత్రానికి లభించింది. దీంతో ఈ మూవీ ఈ నెల 12వ తేదిన ప్రేక్షకుల ముందుకురానుంది.

కామెడీ, సెంటిమెంట్‌, లవ్‌ తో ఈ చిత్రం రూపొందించారు. మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాల్లో మురళి శర్మ కల్యాణ్‌ దేవ్‌ తండ్రి పాత్రలో నటించారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు. కె.కె. సెంథిల్‌ కుమార్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి అందించారు. వారహి చలనచిత్రం బ్యానర్‌లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, నాజర్‌, సత్యం రాజేష్‌, ప్రగతి, రాజీవ్‌ కనకాల తదితరులు నటిస్తున్నారు.