HomeTelugu Newsప్రభాస్‌ కోసం టైమ్‌ లేదంటున్న దర్శకుడు!

ప్రభాస్‌ కోసం టైమ్‌ లేదంటున్న దర్శకుడు!

Tamil director has no time for Prabhas
పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలు అన్నట్లుగా సౌత్ మరియు నార్త్‌ కి చెందిన స్టార్‌ దర్శకులు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. అయితే తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అందరికీ భిన్నంగా.. ప్రభాస్‌ తో సినిమాకు తన వద్ద టైమ్‌ లేదు అంటూ మైత్రి మూవీ మేకర్స్ వారితో చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త హాట్‌టాపిక్‌గా మారింది.

గత కొన్ని రోజులుగా మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్ డైరెక్షన్‌లో ఓ సినిమాను ప్లాన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లోకేష్‌ కనగరాజ్ తో చర్చలు జరిపారు. కానీ ముందుగానే కమిట్ అయ్యి ఉన్న సినిమాల కారణంగా ప్రభాస్ తో సినిమాకు ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన అన్నాడట. ప్రభాస్ అంటే తనకు అభిమానం అంటూనే ఇప్పటికే రజినీకాంత్‌ మూవీ తో పాటు ఖైదీ 2, విక్రమ్‌ 2 మరియు లియో సీక్వెల్స్ ను చేయాల్సి ఉంది.

ఈ కారణంగా ప్రభాస్‌తో సినిమాను చేయలేక పోతున్నట్లు లోకేష్ కనగరాజ్ తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడని టాక్. మరో వైపు ప్రభాస్‌ కూడా చాలా బిజీగా ఉన్నాడు. ఒక వేళ లోకేష్ కనగరాజ్ సిద్ధంగా ఉన్నా కూడా ప్రభాస్ మాత్రం కల్కి, రాజా సాబ్‌, సలార్‌ 2, హను రాఘవపూడి మూవీ ఇలా చాలా సినిమాలను లైన్ లో ఉన్నాయి. ఈక్రమంలో ఇప్పట్లో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశం లేదు అనే చెప్పాలి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu