విద్యాబాలన్‌కు చీరను బహుకరించిన బాలకృష్ణ ఫ్యామిలీ

బాలకృష్ణ సొంతగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. బాలకృష్ణ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో కనిపించిగా క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నందమూరి తారకరామారావుగారి సతీమణి బసవతారకంగారి పాత్రలో విద్యాబాలన్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె ఈరోజు(బుధ వారం) నుండి షూటింగ్ పనుల్లో పాల్గొననున్నారు.

ఈ సందర్బంగా బాలకృష్ణ, ఆయన సోదరి లోకేశ్వరి విద్యాబాలన్ ను తెలుగు ఆచారం ప్రకారం చీరను బహుకరించి సినిమాలోకి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి, కుమార్తె తేజస్విని, అల్లుడు శ్రీభరత్ లు కూడ పాల్గొన్నారుసాంప్రదాయాన్ని, ఆచారాలను గౌరవించడంలో, ఆచరించడంలో హీరో నందమూరి బాలక్రిష్ణ ముందుంటారు. ముఖ్యంగా ఆయన అతిధులను, ఆత్మీయులను ఆహ్వానించే తీరు చాలా గొప్పగా ఉంటుంది.