వెంకీ స్టైలిష్ లుక్!

‘గురు’ సినిమా తరువాత విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. దీనికి ‘ఆటా నాదే వేటా నాదే’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే గురు సినిమాలో మిడిల్ ఏజ్ హీరోగా కనిపించిన వెంకీ ఇప్పుడు తేజ సినిమా కోసం స్టైలిష్ లుక్ ను ట్రై చేశాడు. సురేష్ బాబు నిర్మాణ భాగస్వామ్యంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ లుక్ అదిరిపోయింది.
కళ్ళజోడు పెట్టుకొని ఒక చేతిలో బ్యాగ్ మరో చేతిలో పుస్తకాలు పట్టుకొని ఉన్న వెంకీ స్టిల్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో వెంకీ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నాడు. వెంకీకు జంటగా శ్రియ నటిస్తోందని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ క్రిష్ డైరక్షన్ లో మూవీ చేస్తాడని అంటున్నారు. మరి ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. తేజ సినిమాలో మాత్రం వెంకటేష్ తో పాటుగా నారా రోహిత్, ఈషా రెబ్బలు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.