గూగుల్‌ సెర్చ్‌లో టాప్ ప్లేస్‌లో మలయాళీ భామ!!

2018లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన భారతీయ సెలబ్రిటీల్లో కన్ను గీటి కుర్రకారును ఫిదా చేసిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ మొదటి స్థానం నిలిచారు. ‘ఒరు అదార్ లవ్‌’ చిత్రంలోని ‘మాణిక్య మలరయ’ అనే పాటలో ప్రియా కన్నుకొడుతూ హావభావాలను పలికిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో ఏ స్థాయిలో వైరల్‌గా మారిందో తెలిసిందే. ఆ సినిమా విడుదలకు ముందే ప్రియా దేశవ్యాప్తంగా పాపులర్‌ అయిపోయారు. అల్లు అర్జున్‌, రిషి కపూర్‌లాంటి అగ్రతారల మెప్పుపొందారు.

ఈ వీడియో విడుదలయ్యాక నెటిజన్లు ప్రియా గురించి గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారట. అలా ఆమె గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్‌ చేసిన భారతీయ సెలబ్రిటీగా మొదటి స్థానం సంపాదించుకున్నారు. రెండో స్థానంలో ప్రముఖ భారతీయ నృత్యకారిణి సప్నా చౌదరి ఉన్నారు. మూడో స్థానంలో బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ భర్త ఆనంద్‌ అహూజా, నాలుగో స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏడో ప్లేస్ ను సొంతం చేసుకున్నాడు

CLICK HERE!! For the aha Latest Updates