వెండి తెరపై చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు విజన్ గురించి ఈ సినిమా ఉంటుందట. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్, రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర సినిమాలు వస్తున్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు విజన్ ఆధారంగా బయోపిక్ రూపొందబోతున్నట్టు తెలుస్తున్నది.

 

కాగా రూ.3 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు వెంకటరమణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంజీవో హెల్ప్ డెస్క్ సీఈవో జివికె రాజేంద్ర ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడట. నారా చంద్రబాబు పాత్రలో ఎవరు నటించబోతున్నారు, మిగతా క్యాస్టింగ్ ఏంటి అనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తారట.