శ్రీ కిషోర్ దర్శకత్వంలో `దేవిశ్రీప్రసాద్` రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

శ్రీ కిషోర్ దర్శకత్వంలో `దేవిశ్రీప్రసాద్` రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

`స‌శేషం`,`భూ` చిత్రాల‌తో తెలుగు సినీ అభిమానులు, ప్రేక్ష‌కుల సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు శ్రీ కిషోర్ హ్యాట్రిక్ చిత్రం `దేవిశ్రీప్రసాద్‘ ను తెరకెక్కించడానికి సిద్ధ‌మ‌య్యారు. రీసెంట్‌గా సినిమా లాంచనంగా ప్రారంభ‌మైంది. ఆర్‌.ఓ.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ పుట్టిన‌రోజునే ప్రారంభం కావ‌డం యాదృచ్ఛికం. డిఫ‌రెంట్ పాయింట్ తో ఆడియెన్స్ ను థ్రిల్ కు గురిచేసే ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుల‌తో సాగే క‌థాంశంతో తెర‌కెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో ఓ క‌మెడియ‌న్‌తో పాటు  ఇద్ద‌రు ప్ర‌ముఖ హీరోలు, ఓ ప్ర‌ముఖ హీరోయిన్‌తో పాటు ప్ర‌ముఖ తారాగ‌ణం న‌టిస్తున్నారు. రీసెంట్‌గా మేం విడుద‌ల చేసిన దేవిశ్రీప్రసాద్` అనే టైటిల్, పోస్ట‌ర్  ప్రేక్షకుల్లో ఓ క్యూరియాసిటీని రేకిత్తించింద‌న‌డంలో సందేహం లేదు. ఇలా ప్ర‌తి విష‌యంలో ఇన్నోవేటివ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులకు డిఫ‌రెంట్‌ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే మూవీగా అన్నీ హంగుల‌తో సినిమాను రూపొందిస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు శ్రీకిషోర్ అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates