సురేష్ కొండేటి “జనతా హోటల్”

ప్రేక్షకుల హృదయాలను తాకే చిత్రాలను ప్రేక్షకులకు అందించడంలో సురేష్ కొండేటి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రేమిస్తే నుంచి శంభోశంకర వరకు సురేష్ కొండేటి అందించిన సినిమాలు ఇదే కోవలోకి వస్తాయి. ఫీల్‌గుడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్‌ బ్యానర్‌పై సురేష్ కొండేటి అందించిన చిత్రాలు ఆయనకు మంచి నిర్మాతగా పేరు తెచ్చాయి. తాజాగా ఆయన అందిస్తోన్న మరో చిత్రం “జనతా హోటల్” విడుదలకు సిద్ధమవుతోంది.

మలయాళంలో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా సూపర్ హిట్ సాధించిన “ఉస్మాద్ హోటల్” చిత్రాన్ని జనతా హోటల్ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. అన్వర్ రషీద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలి కాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంలో దుల్కర్, నిత్యామీనన్ జంట సినిమాకు హైలైట్‌గా నిలిచారని నిర్మాత సురేష్ కొండేటి తెలిపారు. ఈ చిత్రానికి గోపీసుందర్ పాటలు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పారు. లవ్, సెంటిమెంట్‌, పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం తదితర అంశాలతో చక్కని ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అని అన్నారు.