సూపర్ హీరోలందరూ ఒకే సినిమాలో!

హాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో యాక్షన్ చిత్రాలు వచ్చాయి..అయితే ‘ఎవెంజర్స్‌ ’ పేరు తో వచ్చిన చిత్రాలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ సీరిస్ తో వచ్చిన సినిమాలకు భారీ కలెక్షన్లు కూడా వసూళ్లు చేశాయి. కొంత కాలంగా హాలీవుడ్ చిత్రాలు భారత్ లో కూడా భారీగా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఇక సమ్మర్ సీజన్ లో మరో అద్భుతం సృష్టించబోతుంది.. ‘ఎవెంజర్స్‌ – ఇన్‌ఫినిటీ వార్‌’. అత్యంత శక్తిమంతమైన శత్రువును ఎదుర్కొనేందుకు ఐరన్‌ మ్యాన్‌, థోర్‌, స్పైడర్ మాన్, ఎవెంజర్స్‌ అందరూ ఒక్కటయ్యారు. విశ్వాన్ని తన అదుపు ఆజ్ఞల్లోకి తెచ్చుకునేందుకు అవసరమైన ఇన్‌ఫినిటీ స్టోన్స్‌ను సేకరించేందుకు ప్రయత్నిస్తున్న ఈవిల్‌ థానోస్‌ను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ మూవీ న్యూ ట్రైలర్‌ను మార్వెల్‌ విడుదల చేసింది. ఇప్పటికే విడుదల చేసిన ఒక ట్రైలర్‌ అలరించగా, దానిని మించేలా ఈ ట్రైలర్‌ ఉండటం గమనార్హం. సూపర్‌ హీరోలందరూ థానోస్‌ను ఎదుర్కోవడమే ఈ చిత్రంలో ప్రధానాంశంగా చూపించబోతున్నారు.