హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ‘వైరస్’!

సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వైరస్’. ‘నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్’ అనేది ట్యాగ్ లైన్. గీత్ షా కథానాయిక. సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పుల్లరేవు రామచంద్రారెడ్డి సమర్పిస్తున్నారు. మీనాక్షీ భుజంగ్-సునీల్ కశ్యప్ ద్వయం సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం ఆడియోను మే 20న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత సలీమ్.ఎం.డి మాట్లాడుతూ.. ”హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘వైరస్’ సినిమా టీజర్ ను ఇటీవల విడుదల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 20న పాటల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం” అన్నారు. 
 
CLICK HERE!! For the aha Latest Updates