HomeTelugu Newsఆర్‌ఎక్స్‌100కి దర్శకుడికి కాస్ట్‌లీ బహుమతి

ఆర్‌ఎక్స్‌100కి దర్శకుడికి కాస్ట్‌లీ బహుమతి

ఆర్‌ఎక్స్‌100 వంటి చిన్న సినిమా ఇటీవల సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు అజయ్‌ భూపతి టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాడు. కేవలం రూ.3 కోట్లతో రూపొందిన ఈ సినిమా దానికి నాలుగింతలు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఓ థియేటర్ లో ఏకంగా బాహుబలి కలెక్షన్లనే మించిపోయింది. పాయల్ హాట్ హాట్ అందాలకు యువత ఫిదా అయ్యారు. అర్జున్ రెడ్డి స్ఫూర్తిగా ఈ సినిమా తెరకెక్కింది.

1 17

 

కార్తికేయ రఫ్ లుక్ ఆకట్టుకున్నది. లాంగ్ రన్ లో ఈ సినిమా మొత్తం రూ.11 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసి నిర్మాతలు లాభాల పంటను పండించింది. దీంతో దర్శకుడు అజయ్ భూపతికి ..నిర్మాత అశోక్‌ గుమ్మకొండ ఓ కాస్ట్‌లీ బహుమతి ఇచ్చారు. జీప్ కార్ ను బహుమతిగా ప్రజెంట్ చేశాడు. కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఆర్‌ఎక్స్‌ 100 సినిమాలో రావూ రమేష్‌. రాంఖీలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. చైతన్య భరద్వాజ్‌ సంగీతమందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!