HomeTelugu Newsఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరులో 'ఎన్టీఆర్' చిత్ర బృందం

ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరులో ‘ఎన్టీఆర్’ చిత్ర బృందం

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ ‘ఎన్టీఆర్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్‌ పన్నులు మొదలు పెట్టిన వీరు తర్వాతి షెడ్యల్‌ కు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా నిన్న బాలయ్య, క్రిష్ లు నటుడు రానాను వెంటబెట్టుకుని ఎన్టీఆర్ అల్లుడైనా సిఎం చంద్రబాబు నాయుడును కలిసి పలు విషయాల్ని చర్చించారు. అంతే కాకుండా వీరిద్దరూ ఈరోజు ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరు, ఎన్టీఆర్‌ భార్య బసవతారకంగారి సొంత ఊరు కొమరవోలులో పలు ప్రాంతాల్ని తిరిగి, కొందరు ముఖ్య వ్యక్తుల్ని కలిస్ సినిమాకు అవసరమైన ఇన్ పుట్స్ సేకరించి, షూటింగ్ కొరకు లొకేషన్స్ ను కూడ ఎంచుకోనున్నారు.

3 2

ఈ ప్రయాణంలో తనకు ఎన్టీఆర్ గురించి రోజుకో కొత్త, ఆసక్తికరమైన విషయం తెలుస్తోందని, జనాలకు ఎన్టీఆర్ గురించి తెలిసింది కొంత మాత్రమేనని అన్నారు. శాతకర్ణి సినిమా తర్వాత బాలక్రిష్ణతో కలిసి ఎన్టీఆర్ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇక బాలక్రిష్ణ మాట్లాడుతూ ఈ సినిమాను తరతరాలకు గుర్తుంచిపోయేలా తీర్చిదిద్దుతామని, ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు జనవరి 9న ఈ చిత్ర విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వారాహి చలన చిత్రం, బాలయ్యలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ బయోపిక్ పై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

3a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!