HomeTelugu Newsకంగనా మణికర్ణిక ఈ ఏడాదే!

కంగనా మణికర్ణిక ఈ ఏడాదే!

ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న మణికర్ణిక (ది క్విన్‌ ఆఫ్ ఝాన్సీ) చిత్రం భారీ అంచనాలతో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు హిందీ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రం గత ఏడాది ప్రారంభమైంది. ప్రేక్షక లోకం ఈ చిత్రం విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోంది. బ్రిటిష్‌ వారిని ఎదిరించిన వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చారిత్రక చిత్రం కావడంతో సాధారణంగా ఎక్కువ సమయం తీసుకుంటుందన్నది తెలిసిన విషయమే. అదీకాకుండా సహజత్వానికి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశ్యంతో కంగనారనౌత్‌ ప్రత్యేక శిక్షణ తీసుకుని ఈ చిత్రంలో కత్తి ఫైట్‌ సన్నివేశాల్లో నటించినప్పుడు.. ఆమె గాయపడిన సంగతి తెలిసిందే.

1 9

చిత్రీకరణ సమయంలో ఒకసారి ఆమె ముఖానికి, మరోసారి కాలికి గాయాలయ్యాయి. ఇలా రెండుసార్లు ఆమె గాయపడటంతో కొద్దిరోజులు విశ్రాంతి కూడా తీసుకోవాల్సి వచ్చింది. అయినా మణికర్ణిక పాత్రకు న్యాయం చేయాలన్న పట్టుదలతో ఆమె ఎలాంటి రిస్క్‌ అయినా లెక్కచేయక ఈ చిత్రంలో నటించడం కొనసాగించింది. మరోవైపు తన చిత్రాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని పరితపించే దర్శకుడు క్రిష్ ఈ చారిత్రక చిత్రాన్ని ఎంచుకున్నారు. అయితే క్రిష్ బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించే బాధ్యతను తీసుకున్నాడు కదా మరి మణికర్ణిక చిత్రం సంగతేంటన్న దానిపై ముంబైలో ఓ స్పష్టత వచ్చిందని చెబుతున్నారు. గతేడాది మేలో ప్రారంభమైన ఈ చిత్రం ఆ తర్వాత జూన్, జులైలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుందని ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!