కోడిపై జాలి చూపిస్తే.. చికెన్ 65 ఎలా తింటావ్..బ్లఫ్ మాస్టర్ ట్రైలర్‌


డబ్బు సంపాదించడమే ప్రధానాంశంగా పెట్టుకున్న ఓ యువకుడి కథే బ్లఫ్ మాస్టర్. ఈ చిత్రంలో సత్యదేవ్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్టైన సతురంగ వెట్టై సినిమాకు రీమేక్ ఇది. డబ్బు సంపాదించడం కోసం ప్రజలను రకరకాలుగా మోసాలు చేస్తుంటాడు. తులం బంగారం సగం ధరకే ఇస్తామని చెప్తే… జనాలు బారులు తీరి నిలబడటం వెనుక ప్రజలను ఈజీగా ఎలా మోసం చెయ్యొచ్చో చూపించాడు. డబ్బు సంపాదించాలంటే హత్యలు దోపిడీలు చెయ్యక్కర్లేదు.. చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించవచ్చు అని చెప్పడం ద్వారా ఆ పాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటో చెప్పకనే చెప్పారు.

గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి… ఇవి పంచభూతాలు.. ఈ ఐదు పంచభూతాలను శాసించే స్థాయికి ఎదిగిన ఆరో పంచభూతం డబ్బు. డబ్బు తనపై వచ్చిన అభియోగాలను చెరిపేసుకునే డస్టర్ లా పనిచేస్తుంది. కోడిపై జాలి చూపిస్తే.. చికెన్ 65 ఎలా తింటావ్ అని చెప్తూ ఎండ్ చేశారు. ఇప్పటి కాలానికి అనుగుణంగా ట్రైలర్ ఉన్నది. ఈ సినిమా డిసెంబర్ 28 న రిలీజ్ కాబోతున్నది.

CLICK HERE!! For the aha Latest Updates