‘మరో ప్రస్థానం’ ట్రైలర్‌

తనీష్ హీరోగా డైరెక్టర్‌ జాని రూపొందించిన చిత్రం ‘మరో ప్రస్థానం’. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ హీరోయిన్‌గా నటించింది. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహా ప్రస్థానం’ మూవీ ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.

విలన్‌ చేసే వరుస హత్యలను హీరో బృందం కెమెరాల్లో బంధించి, నిజాన్ని బయటపెట్టాలనుకుంటుంది. ఈ క్రమంలో రెండు బృందాల మధ్య పోరాటం మొదలవుతుంది. చివరకు ఏమైందనేది ఆసక్తిని పెంచేలా ట్రైలర్‌ని కట్‌ చేశారు. ‘ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు అసలైన మనుషులు. ఒకరు చనిపోయినవాడు. మరొకడు ఇంకా పుట్టనివాడు’ అని విలన్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది.

CLICK HERE!! For the aha Latest Updates