Homeతెలుగు Newsజనసేన మేనిఫెస్టో

జనసేన మేనిఫెస్టో

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దూకుడు పెంచారు. ఇప్పటికే జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తున్న పవన్‌.. తాజాగా జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేశారు. ఈరోజు ఆయన భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు.
ఇందులో ఏడు సిద్ధాంతాలు, 12 హామీలను పొందుపర్చారు.

7 12

సిద్ధాంతాలు..

1. కులాలను కలిపే ఆలోచనా విధానం
2. మతాల ప్రస్తావన లేని రాజకీయం
3. భాషలను గౌరవించే సంప్రదాయం
4. సంస్కృతులను కాపాడే సమాజం
5. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం
6. అవినీతిపై రాజీలేని పోరాటం
7. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం

7a 3

హామీలు..

1. మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు
2. గృహిణులకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు
3. రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500-3500 మధ్య నగదు జమ
4. బీసీలకు అవకాశాన్ని బట్టి రాజకీయంగా 5శాతానికి రిజర్వేషన్ల పెంపు
5. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు
6. కాపులకు 9వ షెడ్యూల్‌ ద్వారా రిజర్వేషన్ల కల్పన
7. ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం
8. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పోరేషన్‌
9. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతిగృహాలు
10. ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ విధానాలు అమలు
11. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు
12. వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు

Recent Articles English

Gallery

Recent Articles Telugu