Homeతెలుగు Newsఅమెరికాలో 'ఆదిపురుష్'ను దెబ్బ కొడుతున్న 'ఫ్లాష్'

అమెరికాలో ‘ఆదిపురుష్’ను దెబ్బ కొడుతున్న ‘ఫ్లాష్’

Flash hitting Adipurush in America

పాపం ప్రభాస్! ఏ ముహూర్తాన ‘ఆదిపురుష్’ స్టార్ట్ చేశాడో కానీ ఎప్పుడూ లేని విధంగా అడ్డంకులు ఎదుర్కొంటున్నాడు. ఒక సమస్య తీరిందని సంబరపడే లోపు మరో సమస్య వచ్చి పడుతుంది. టీజర్ రిలీజ్ అయ్యాక ట్రోల్స్ వచ్చాయి. డై హార్డ్ ప్రభాస్ ఫ్యాన్స్ సైతం బాలేదని నిర్మొహమాటంగా చెప్పేశారు. ట్రైలర్ తర్వాత ట్రోల్స్ తగ్గాయి. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. సాంగ్స్ రిలీజయ్యాక హైప్ పెరిగింది. ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తే ఓవర్సీస్ కలెక్షన్లకు ‘ఫ్లాష్’ మూవీ దెబ్బ కొడుతుంది.

‘ఆదిపురుష్’ రిలీజ్ అవుతున్న జూన్ 16న హాలీవుడ్ మూవీ ‘ఫ్లాష్’ రిలీజ్ కూడా! ఆ సినిమా మీద అమెరికాలో మంచి బజ్ ఉంది. అక్కడ ‘ఫ్లాష్’కు ఎక్కువ స్క్రీన్లు ఇస్తున్నారు. ఇప్పటికి అమెరికాలో ‘ఆదిపురుష్’ ఎన్ని స్క్రీన్లలో రిలీజ్ అవుతుందనే క్లారిటీ లేదు.

సినిమా రిలీజ్ కు ఒక్కోసారి నెల రోజుల ముందు అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేస్తారు. ‘ఆదిపురుష్’ విడుదలకు పట్టుమని ఇంకా పది రోజుల టైమ్ కూడా లేదు. వందకు అటు ఇటుగా లొకేషన్లలో ప్రీమియర్ షోస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నాని ‘దసరా’ రిలీజ్ టైంలో పది రోజుల ముందు 200 లొకేషన్లలో బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రజెంట్ అమెరికాలో ట్రెండ్ చూస్తుంటే ‘ఆదిపురుష్’ను ‘ఫ్లాష్’ గట్టిగా దెబ్బ కొడుతున్నట్టు ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత బజ్ గట్టిగా క్రియేట్ అయితే లొకేషన్స్ పెరిగే ఛాన్స్ ఉంది.

‘ఆదిపురుష్’ లొకేషన్స్ ఇక పెరగవని కాదు. ‘బాహుబలి’కి అమెరికా నుంచి కోట్లకు కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. అక్కడ ప్రభాస్ క్రేజ్ పీక్స్ లో ఉన్న రోజులు ఉన్నాయి. ఆ క్రేజ్ క్యాష్ చేసుకోవడంలో ‘ఆదిపురుష్’ టీం ఫెయిల్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu