Homeతెలుగు Newsఢిల్లీలో ఉండే నాయకులు ఉలిక్కి పడాలి: చంద్రబాబు

ఢిల్లీలో ఉండే నాయకులు ఉలిక్కి పడాలి: చంద్రబాబు

గుంటూరులో “నారా హమారా టీడీపీ హమారా” ముస్లిం మైనారిటీ సభ నిర్వహించారు. సీఎం చంద్రబాబు ముస్లిం సంప్రదాయ దుస్తులు ధరించి సభలో పాల్గొన్నారు.నా రాజకీయ జీవితంలో ఇంత పెద్ద మైనారిటీ సభను చూడలేదు, అలాంటి సభకు నాంది పలికామని, ఇది పోరాట పటిమకు శ్రీకారం, మీరంతా సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్లు అంటూ చంద్రబాబు అందరినీ పలకరిస్తూ ప్రసంగించారు. ఉర్దూలో ప్రసంగం ప్రారంభించిన చంద్రబాబు మనల్ని మోసం చేసిన బీజేపీని గద్దె దించేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ఢిల్లీకి వినపడేలా అందరూ గట్టిగా చెప్పాలని ఢిల్లీలో ఉండే నాయకులు ఉలిక్కి పడాలని చంద్రబాబు అన్నారు. ఎన్డీయే ఆటలు ఇంక సాగవని రాబోయే రోజుల్లో గద్దె దించుతామని గట్టిగా గర్జించే సమయమిది అని చంద్రబాబు తెలిపారు.

9a 6

 

 

 

ఎన్డీయే నుంచి బయటికి వచ్చి మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన తొలి పార్టీ టీడీపీ అని చంద్రబాబు అన్నారు. మన ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంటులో గళం విప్పి గట్టిగా పోరాడారు.. తెలుగు వాణి గట్టిగా వినిపించిన మన ఎంపీల్లో గల్లా జయదేవ్‌ మొదటి స్థానంలో ఉన్నారని కొనియాడారు. గుంటూరుతో ఎన్టీఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేశారు. గుంటూరు దేశభక్తికి మారుపేరని చంద్రబాబు అన్నారు. మేం వీరోచితంగా పోరాడుతుంటే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఇంటి వద్ద కూర్చున్న పిరికి వారిని ఏం చేయాలని చంద్రబాబు అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో మైనారిటీలు కీలకపాత్ర పోషించారని అన్నారు. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. వైసీపీ నేతలు బీజేపీతో కలిసి పోయారు, అందుకే మోడీని ప్రశ్నించడం లేదని చంద్రబాబు అన్నారు. మైనారిటీ సోదరుల కోసం తాను పోరాడుతున్నానని, నిజనిర్ధారణ పేరుతో కమిటీ వేసిన పవన్ ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ముస్లింలకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu