HomeTelugu Newsనాగ్ అశ్విన్ తర్వాతి సినిమా!

నాగ్ అశ్విన్ తర్వాతి సినిమా!

నాగ్అశ్విన్.. రెండు సినిమాలతోటే స్టార్ దర్శకుడయ్యాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సక్సెస్ తర్వాత రెండేళ్లకు
మహానటి తెరపైకి వచ్చింది. మహానటి కథ కోసం రెండేళ్లు అన్వేషణ సాగించాడు నాగ్ అశ్విన్. భారీ
తారాగణంతో, భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన మహానటి సినిమాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా
మంచి సక్సెస్ కావడంతో తర్వాత సినిమా ఏమిటా.. ఎప్పుడా అనేది సినీ జనాలు ఎదురుచూస్తున్నారు.

3

నాగ్ అశ్విన్ ఇప్పుడు కథ ఎవరికైనా చెప్పే అవకాశముంది. కథను సినిమాగా తీసేందుకు వైజయంతి
మూవీసం, స్వప్న సినిమాలున్నాయి. కథ, స్క్రిప్ట్, హీరో ఓకే అయితే సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. కానీ నాగ్
అశ్విన్ మాత్రం హడావుడిగా ఏదో చేసేద్దామని అనుకోవడం లేదు. నిదానంగా వర్క్ చేసి నూరు శాతం
విజయం సాధిస్తాడు.

నాగ్ అశ్విన్ తర్వాతి సినిమా చిరంజీవితో ఉంటుందని ఇప్పటికే స్పష్టమైంది. అయితే సినిమాకు సంబంధించిన
కథ, కథనాలు ఇంకా సిద్ధం కాలేదు. టైమ్ మెషిన్ కు సంబంధించిన కథ అని తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్
అశ్విన్ మహానటి సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. మరో 3 నెలల తర్వాత చిరంజీవి సినిమా కథపై
వర్కవుట్ చేయనున్నాడు. ప్రస్తుతం చిరు కూడా సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సైరా
పూర్తికావడానికి ఇంకా ఏడాది పట్టొచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!