HomeTelugu Newsపోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో "తేజ్ ఐ లవ్ యు"

పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో “తేజ్ ఐ లవ్ యు”

సాయిధరమ్ తేజ్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న సినిమా “తేజ్ ఐ లవ్ యు” ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కేఎస్ రామారావు, వల్లభ నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్యారిస్‌లో 2 పాటలు చిత్రీకరించారు. దీంతో షూటింగ్ పార్ట్ పూర్తయింది.

2 6

సాయిధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యు చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకాఈచిత్రంలో జయప్రకాష్, పృథ్వీ, సురేఖావాణి, పవిత్రా లోకేష్ తదితరులు నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రం జూన్ 29న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu