Homeతెలుగు Newsప్రాజెక్టుల అంశంపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు

ప్రాజెక్టుల అంశంపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల ఎకరాలకు నీరివ్వాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాబోయే 40 రోజుల్లో 47 ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. తాము చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నామని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో ప్రాజెక్టుల అంశంపై మీడియాతో మాట్లాడారు.

7 2

రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా తయారు చేస్తాం. ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు నిండాయి. ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాం. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులపై రూ.58 వేల 24 కోట్లు ఖర్చు చేశాం. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులపై ఎక్కువగా ఖర్చు చేశాం. 57 ప్రాజెక్టులకు గాను 10 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశాం. అక్టోబరు నెలలో మూడు, నవంబర్‌లో మరో ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఈ ఏడాది గోదావరి నుంచి దాదాపు 2 వేల టీఎంసీలు నీళ్లు సముద్రంలో కలిశాయి. కానీ, ప్రభుత్వ చర్యల వల్ల ఇవాళ అన్ని జలాశయాల్లో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. మొత్తం అన్ని జలాశయాల్లో 600 టీంసీలు మేర నీరు అందుబాటులో ఉంది. దూరదృష్టితో ఆలోచించి సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశాం. వంశధార- నాగవళి అనుసంధానం ఈ ఏడాది చేపడుతున్నాం. రాబోయే 40 రోజుల్లో 47 ప్రాజెక్టలకు టెండర్లు పిలుస్తాం. రెండు కోట్ల ఎకరాలకు నీళ్లివ్వాలన్నదే మా లక్ష్యం. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు 73 సార్లు సమీక్షించి, 23 సార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాను. మొత్తంగా 50 శాతం పనులు పూర్తయ్యాయి. పోలవరంపై ఇప్పటికే రూ.14,600 కోట్లు ఖర్చు చేశాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.2,736 కోట్లు రీయింబర్స్‌మెంట్‌ కావాల్సి ఉంది. వచ్చే ఏడాది మే నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించున్నాం అని చంద్రబాబు అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu