
ఈ రోజు రాజకీయ నాయకుల గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. మేకతోటి సుచరిత. మధ్యతరగతి దళిత కుటుంబంలో పుట్టి.. తక్కువ సమయంలోనే, పైగా చిన్న వయసులోనే మంత్రి అయిన అతికొద్ది రాజకీయ వ్యక్తుల్లో మేకతోటి సుచరిత కూడా ఒకరు. ఇంతకీ రాజకీయ నాయకురాలిగా మేకతోటి సుచరిత గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో మేకతోటి సుచరిత పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో మేకతోటి సుచరిత పరిస్థితేంటి ?, అసలు ఆమె నేపథ్యం ఏమిటి ? మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ మేకతోటి సుచరితకి ఉందా ? తెలుసుకుందాం రండి.
మేకతోటి సుచరిత ఉమ్మడి గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం ఫిరంగిపురం గ్రామంలో మధ్యతరగతి దళిత కుటుంబంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సుచరిత మదురై కామరాజ్ దూర విశ్వవిద్యాలయం నుండి బి ఏ పూర్తి చేశారు. సుచరిత 2006లో ఫిరంగిపురం జెడ్పీటీసీ గా రాజకీయ ప్రయాణం ప్రారంభించి 2009 లో ప్రత్తిపాడు రిజర్వ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012 లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకొని ఆ సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి రెండోసారి విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా.. 2019 లో అదే నియోజకవర్గం నుంచి మరో సారి విజయం సాధించారు.
2019 – 22 వరకు రాష్ట్ర హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత బలహీనమైన హోం మంత్రిగా సుచరిత ప్రజలకు గుర్తుండిపోతారు. ఆమె భర్త దయాసాగర్ ఆమె అధికారులను వాడుకుంటూ ఆమెను పేరుకే మంత్రిని చేశారని ఆరోపణలు ఉన్నాయి. చివరకు ఆ మంత్రి పదవి కూడా ఆమెకు దూరం అయ్యింది. దీనికితోడు మేకతోటి సుచరిత కి రాజకీయాల పై పెద్దగా అవగాహన లేకపోవడం, ప్రజల సమస్యలను సమర్థవంతంగా తీర్చలేక పోవడం వంటి అంశాలు ఆమె రాజకీయ ప్రభకు మైనస్ అయ్యాయి. ఇంతకీ వచ్చే ఎన్నికల్లో మేకతోటి సుచరిత పరిస్థితి ఎలా ఉండబోతుంది ?, అలాగే ఆమె గ్రాఫ్ విషయానికి వస్తే.. మేకతోటి సుచరిత ప్రజల్లో పట్టు కోల్పోయారు.
పైగా మేకతోటి సుచరిత తీరు పై కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. శాసనసభ వేదికగా మౌనంగా ఉండటం తప్పితే ఆమె వల్ల ప్రత్తిపాడు రిజర్వ్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నిజానికి మేకతోటి సుచరిత నిత్యం ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నా.. ప్రజల సమస్యలను మాత్రం ఆమె తీర్చలేకపోతున్నారు. అలాగే, సోషల్ మీడియాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకుని.. ఎప్పటికప్పుడు తన గళాన్ని వినిపిస్తున్నా.. ఆమెకు ప్రజల్లో ఆదరణ కరువు అయ్యింది. మొత్తంగా ఒక రాజకీయ నాయకురాలిగా ఆమె గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో మేకతోటి సుచరిత గెలవడం కష్టమే. పైగా సుచరిత జగన్ రెడ్డి పై అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు జగన్ మళ్లీ టికెట్ ఇవ్వడం పైనే అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మేకతోటి సుచరితకి ఇక రాజకీయ భవిష్యత్తు లేకపోవచ్చు.













