HomeTelugu Newsరివ్యూ: తొలిప్రేమ

రివ్యూ: తొలిప్రేమ

నటీనటులు: వరుణ్ తేజ్, రాశిఖన్నా, ప్రియదర్శి, సుహాసిని తదితరులు
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి.విలియమ్స్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
దర్శకత్వం: వెంకీ అట్లూరి
విభిన్న చిత్రాలను ఎన్నుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న హీరో వరుణ్ తేజ్. గతేడాది ‘ఫిదా’ చిత్రంతో సక్సెస్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు ‘తొలిప్రేమ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి సినిమా ఎలా ఉందొ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
varun 1
కథ: 
ఆదిత్య(వరుణ్ తేజ్) ట్రైన్ లో వర్ష(రాశిఖన్నా)ను చూసి ఇష్టపడతాడు. వీరిద్దరికీ ఒకే కాలేజ్ లో అడ్మిషన్ వస్తుంది. వర్షను ప్రేమిస్తూ ఆమె వెంట తిరుగుతుంటాడు ఆదిత్య. వర్ష కూడా కొద్దిరోజులకు ఆదిత్యను ప్రేమిస్తుంది. ఇంతలోనే గొడవ పడి ఇద్దరూ విడిపోతారు. మళ్ళీ ఆరేళ్ళ తరువాత లండన్ లో ఇద్దరూ కలుసుకుంటారు. ఆ తరువాత ఏం జరిగింది..? వీరి ప్రేమ సక్సెస్ అయిందా..? అనేదే మిగిలిన
ప్లస్ పాయింట్స్: 
వరుణ్, రాశిల నటన
డైలాగ్స్
ఫస్ట్ హాఫ్
సంగీతం
మైనస్ పాయింట్స్: 
సెకండ్ హాఫ్ లో సాగతీత
క్లైమాక్స్
విశ్లేషణ: 
ఇద్దరు ప్రేమికులు విడిపోయి మళ్ళీ ఒకటయ్యే కాన్సెప్ట్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. దర్శకుడు వెంకీ అట్లూరి కూడా అదే కథను ఎన్నుకున్నాడు. అయితే కథనం కొత్తగా ఉండడంతో సినిమా ఆడియన్స్ కు తొందరగా కనెక్ట్ అవుతుంది. హీరో, హీరోయిన్ల పాత్రలను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. వీరిద్దరి మధ్య నడిచే సన్నివేశాలు, సంభాషణలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోయింది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా చాలా ఎమోషనల్ గా నడుస్తుంది. అయితే సినిమాలో ఏం జరగబోతుండానే విషయం ఆడియన్స్ ముందే ఊహించగలుగుతారు. ద్వితీయార్ధంలో డైలాగ్స్ బాగా పండాయి. పతక సన్నివేశాలు మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. మొత్తంగా చూసుకుంటే.. ఈ మధ్య కాలంలో వచ్చిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇదేనని చెప్పొచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

నటీనటులు: వరుణ్ తేజ్, రాశిఖన్నా, ప్రియదర్శి, సుహాసిని తదితరులు సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: జార్జ్ సి.విలియమ్స్ ఎడిటింగ్: నవీన్ నూలి నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ దర్శకత్వం: వెంకీ అట్లూరి విభిన్న చిత్రాలను ఎన్నుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న హీరో వరుణ్ తేజ్. గతేడాది 'ఫిదా' చిత్రంతో సక్సెస్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు 'తొలిప్రేమ' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి సినిమా ఎలా ఉందొ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం! కథ:  ఆదిత్య(వరుణ్...రివ్యూ: తొలిప్రేమ