
Raashi Khanna injuries:
వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరిగే హీరోయిన్లు కొంతమంది ఉంటారు. అలాంటి లిస్టులో ముందుంటుంది రాశి ఖన్నా. మొదటి సినిమా కన్నా కూడా.. ఆ తర్వాత వచ్చిన సినిమాలలో తన అందం పెంచుకుంటూ పోయింది ఈ హీరోయిన్.. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఆమె అభిమానుల్లో కలవరం రేపుతున్నాయి.
Raashi Khanna Viral Photos
నాగశౌర్య హీరోగా వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రాశి ఖన్నా. అయితే ఈ హీరోయిన్ తన మొదటి సినిమాలో కొంచెం లావుగా కనిపించిన సంగతి తెలిసిందే.
Raashi Khanna Movies
కానీ ఈ మధ్య మాత్రం చాలా సన్నగా అయిపోయి.. తన మొదటి సినిమా కన్నా ఇప్పుడు ఎంతో అందంగా ఉంది అనే ప్రశంశాలు కూడా తెచ్చుకుంటుంది.
View this post on Instagram
Raashi Khanna Personal Life
తెలుగు, హిందీ, తమిళ్ చిత్ర పరిశ్రమల్లో తన నటనతో గుర్తింపు పొందిన ఈ నటి..ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాలతో పాటు ఓటీటీ సిరీస్ లో కూడా కనిపిస్తోంది.
Raashi Khanna Injured Photos
ఈ క్రమంలో ఆమె తాజాగా.. సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఈ హీరోయిన్ ముక్కు నుంచి రక్తం కారుతూ, కాళ్లకు, చేతులకు గాయాలు అయ్యి రక్తం కారుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసి ఆమె అభిమానులు తెగ కంగారుపడుతున్నారు. అయితే ఈ ఫోటోలు కింద క్యాప్షన్ చూస్తే మాత్రం ఇవి కాస్త ఏదో సినిమా షూటింగ్ సంబంధించినవన్నీ తెలుస్తోంది.
Raashi Khanna Instagram Post
ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. రాశీ ఖన్నా ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు: “కొన్ని రోల్స్ అడగవు, మనల్ని అవి డిమాండ్ చేస్తాయి. మీ శరీరం, మీ శ్వాస, మీ గాయాలు, మీరు తుఫానుగా మారినప్పుడు.. ఎటువంటి ఉరుములకు కదలరు. త్వరలో రానుంది,” అని రాసుకొచ్చారు. ఇక దీంతో ఇవి సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు అని ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.













