Homeతెలుగు Newsరైతు కుటుంబాలకు అండగా ఉంటా: కోటవురట్లలో జగన్

రైతు కుటుంబాలకు అండగా ఉంటా: కోటవురట్లలో జగన్

వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 241వ రోజు సోమవారం ఉదయం.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ శివారు ధర్మసాగరం క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభమైంది. ధర్మసాగరం దగ్గర మహిళలు బారులు తీరి… వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికారు. కాగా చినుకులు పడుతున్నా పాదయాత్ర కొనసాగింది. వర్షంలోనూ జననేత నడక సాగించారు. అశేష జనవాహిని వెంటరాగా అడుగులు ముందుకు వేశారు.

10d

సాయంత్రం పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్లలో వైఎస్ జగన్ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతి రైతు ముఖంలో చిరు నవ్వు చూడాలని, ప్రతి పేదవాడి ముఖంలో ఆనందం చూడాలని నవరత్నాలు ప్రకటించామని అన్నారు. దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఏం చేయబోతున్నామో చెబుతానంటూ జగన్ వెల్లడించారు.
నేడు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. చంద్రబాబు అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రంలో రైతుల వ్యవసాయ రుణాలు రూ. 87,612 కోట్లు ఉంటే అవి నేడు వడ్డీలతో కలిసి లక్షా 26 వేల కోట్లకు పెరిగాయని జగన్ ఆరోపించారు. గతంలో వడ్డీ లేకుండా రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని, చంద్రబాబు రైతన్నలను అడ్డగోలుగా మోసం చేశారని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, పంటలు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని అన్నారు.

10b 1

రైతుల నుంచి తక్కువ ధరకు కొని అదే వస్తువులను ప్యాక్ చేసి మూడు నాలుగు రెట్లు ఎక్కువగా హెరిటేజ్ షాపుల్లో అమ్ముతున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు దళారీలకు నాయకుడు అయిపోయారని విమర్శించారు. మన ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గినప్పుడే మిగిలే ఆదాయం పెరుగుతుందని జగన్ అన్నారు. పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు తమ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీనివల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని అన్నారు. రైతులందరికీ వడ్డీ లేకుండా పంట రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే మే నెలలో ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి పెట్టుబడి కింద రూ. 12,500 చొప్పున ఇస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. అర ఎకరం పొలమున్న రైతుకు పూర్తి పెట్టుబడి
వచ్చినట్టేనని, ఎకరా పొలమున్న రైతుకు దాదాపు 90 శాతం పెట్టుబడి ఖర్చు వచ్చినట్టేనని జగన్ అన్నారు. అలాగే రైతులకు బోర్లు ఉచితంగా వేయిస్తామని హామీ ఇచ్చారు. ఆక్వా రైతులకు కరెంటు యూనిట్ రూ. 1.50కే ఇస్తామని అన్నారు. దీంతో రైతు తన కాళ్లపై తాను నిలబడే పరిస్థితి వస్తుందని జగన్ అన్నారు.

10c

రైతులు వేసే ప్రతి పంటకు ముందుగానే గిట్టుబాటు ధర ప్రకటిస్తామని, రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తామని జగన్ వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మండల కేంద్రంలో గిడ్డంగులు, నియోజకవర్గంలో అవసరాన్ని బట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేవలం వ్యవసాయం మీదే ఆధార పడితే రైతులకు గిట్టుబాటు కాదని అందుకే పాడి కూడా సహాయ పడుతుందని అన్నారు.. పాల కేంద్రాలన్నీ పునరుద్ధరిస్తామని, కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్న రైతులకు పాల సేకరణకు లీటరుకు రూ. 4 బోనస్ ఇస్తామని జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో కరువొచ్చినా, అకాల వర్షాలతో పంటలునష్టపోయినా పట్టించుకునే పరిస్థితి లేదని ఆరోపించారు.

10 15

రైతులకు ఇలాంటి కష్టం రాకుండా చూస్తామని, అకాల వర్షాలొచ్చినా, కరువొచ్చినా నష్టపోకుండా రూ. 4 వేల కోట్లతో కలామిటీ రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ అన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నానని.. ఒకవేళ అదే పరిస్థితి వచ్చి రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి రూ. 5 లక్షలు చేతికిస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఆ రూ. 5 లక్షలు అప్పుల వాళ్లు లాక్కోకుండా చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఆ 5 లక్షలు ఆ కుటుంబానికే ఉపయోగపడేలా చట్టంలో పొందుపరుస్తామని జగన్ అన్నారు. రైతులు ఉపయోగించే ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ లేకుండా చేస్తామని అన్నారు. వీటితో రైతుల జీవితాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నానని.. మీరు ఏమైనా సలహా ఇచ్చినా స్వీకరిస్తానని.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుచేసేందుకు బయల్దేరిన మీ బిడ్డను దీవించాలని, తోడుగా ఉండాలని కోరుకుంటున్నానని జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu