HomeTelugu Reviews"విజేత" మూవీ రివ్యూ

“విజేత” మూవీ రివ్యూ

సినిమా : విజేత
నటీనటులు : కల్యాణ్ దేవ్‌, మాళవిక నాయర్‌, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, జయప్రకాష్‌
దర్శకత్వం : రాకేష్‌ శశి
నిర్మాతలు : సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి
సంగీతం : హర్షవర్దన్‌ రామేశ్వర్‌

1 13

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్ హీరోగా తేరంగేట్రం చేసిన చిత్రం విజేత. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి వారసులు, మేనల్లుళ్లు హీరోగా సెటిల్‌ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కల్యాణ్ దేవ్‌ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. చిరంజీవి ఇమేజ్‌ కల్యాణ్‌కు ప్లస్‌ అవుతుందా? చిరంజీవికి అప్పట్లో విజేత మంచి విజయం అందించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కల్యాణ్‌ దేవ్‌ విజేతతో విజయం సాధిస్తాడా? అనేది చూడాలి?

కథ: రామ్‌ (కల్యాణ్‌ దేవ్‌) ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంటాడు. శ్రీనివాసరావు (మురళీశర్మ) ఓ మధ్య తరగతి తండ్రి. కుటుంబం కోసం తన ఆశయాలను, కోరికలను, ఇష్టాలను త్యాగం చేసి స్టీల్‌ ఫ్యాక్టరీలో ఓ చిరుద్యోగిగా మిగిలిపోతాడు. కానీ హీరో బాధ్యత లేకుండా, ఫ్రెండ్స్‌తో అల్లరి, చిల్లరిగా కాలం గడిపేస్తుంటాడు. తన కాలనీలోకి కొత్తగా వచ్చిన జైత్రను లవ్‌ చేస్తాడు. రామ్‌ చేసిన ఓ పని కారణంగా శ్రీనివాసరావులకు గుండెపోటు వస్తుంది. రామ్‌ అల్లరి పనులు కారణంగా అతనికి ఎవరూ సాయం చేయారు. ఎంతో కష్టంతో తండ్రిని కాపాడుకున్న రామ్‌ జీవితం నిలదొక్కుకున్నాడా? తను అనుకున్నట్టుగా విజయం సాధించాడా? తన తండ్రి కోసం రామ్‌ ఏం చేశాడు? అనేది కథలోని అంశం.

1a 1

నటీనటులు: విజేత సినిమాతో హీరోగా పరిచమైన మెగా అల్లుడు కల్యాణ్ దేవ్‌ తన తొలి చిత్రం నటన పరంగా పరవాలేదనిపించాడు. ఈ సినిమాలో పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా ఎమోషనల్‌ డ్రామాను ఎంచుకున్నాడు. అభిమానుల అంచనాలను వీలైనంత వరకు అందుకోగలిగాడు. ఒకే ఒక్క పాటలో మాత్రమే డ్యాన్‌ చేశాడు. హీరోయిన్‌ మాళవిక నాయర్‌ తన పాత్రకు న్యాయం చేసింది. ఉన్నంతలో హుందాగా కనిపించింది. ఇక తండ్రి పాత్రలో మురళీ శర్మ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో ఇతని పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలిచింది. కొడుకు కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్న మధ్యతరగతి తండ్రి పాత్రలో మురళీ శర్మ నటన చాలా సందర్భాల్లో మనసుకు హత్తుకుంటుంది. హీరో ఫ్రెండ్స్‌గా సుదర్శన్‌, నోయల్‌, కిరిటీ, మహేష్‌ బాగానే నవ్వించారు. నాజర్‌, తనికెళ్ల భరణి, జయ ప్రకాష్‌, రాజీవ్‌ కనకాల, సత్యం రాజేశ్‌, పృథ్వీ చిన్న పాత్రలే అయినా తమ పాత్రకు న్యాయం చేశారు.

విశ్లేషణ: మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మరో హీరోని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడంలో దర్శకుడు రాకేష్ శశి తన బాధ్యతను సమర్ధవంతంగా చేశాడనిపిస్తుంది. ప్రయోగాల జోలికి పోకుండా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నాడు. తండ్రీ కొడుకుల మధ్య అనురాగాన్ని, అనుబంధాన్ని తనదైన రీతిలో తెరకెక్కించాడు. ఫస్టాఫ్ హీరో తన ఫ్రెండ్స్ మధ్య వచ్చే సరదా సన్నివేశాలు, లవ్ స్టోరీతో నడిచిపోతుంది. సెకండాఫ్ మాత్రం ఎమోషనల్‌గా కథ నడుస్తుంది. మధ్యతరగతి జీవితాల్లోని ఇబ్బందులు, సర్దుబాట్లను మనసుకు హత్తుకునేలా రూపొందించాడు దర్శకుడు. ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. చాలా సన్నివేశాల్లో హీరో పాత్ర నేటి యువతకు ప్రతీకగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హర్షవర్దన్ సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. కుటుంబ పరంగా చూడదగ్గ సినిమా.

హైలైట్స్
ఎమోషనల్ సీన్స్
మురళీ శర్మ నటన
సినిమాటోగ్రఫీ, సంగీతం

డ్రాబ్యాక్స్
కథలో కామన్ పాయింట్

చివరిగా : కుటుంబ పరంగా చూడదగ్గ సినిమా “విజేత”
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu

సినిమా : విజేత నటీనటులు : కల్యాణ్ దేవ్‌, మాళవిక నాయర్‌, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, జయప్రకాష్‌ దర్శకత్వం : రాకేష్‌ శశి నిర్మాతలు : సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి సంగీతం : హర్షవర్దన్‌ రామేశ్వర్‌ మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్ హీరోగా తేరంగేట్రం చేసిన చిత్రం విజేత. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి వారసులు, మేనల్లుళ్లు హీరోగా సెటిల్‌ అయిన వాళ్ళు ఉన్నారు...."విజేత" మూవీ రివ్యూ