HomeTelugu Newsసెన్సార్ పూర్తిచేసుకున్న "కాలా"

సెన్సార్ పూర్తిచేసుకున్న “కాలా”

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కాలా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్, రాజకీయ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం నిడివి 166 నిమిషాలు ఉండబోతుంది. ఈ సినిమాను వండర్ బార్ ఫిలిం బ్యానర్లో ధనుష్ నిర్మించారు.

6 4

కాలాకు సంబంధించి ఇది వరకే రిలీజైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రజనీకాంత్ ఈ సినిమాలో ముంబైకి చెందిన ఓ లీడర్ గా కాయకష్టం చేసుకునే కార్మికుల పక్షాన పోరాడే నేతగా కనిపించనున్నాడు. భారీ అంచనాలతో వచ్చేనెల మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు నానా పటేకర్ విలన్ గా కనిపించనున్నాడు. గతంలో రజనీకాంత్ పా.రంజిత్ కాంబినేషన్ లో కబాలి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu