HomeTelugu Newsహీరో సిద్దార్ధ కేరళ డొనేషన్ ఛాలెంజ్

హీరో సిద్దార్ధ కేరళ డొనేషన్ ఛాలెంజ్

కేరళ రాష్ట్రం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయింది. వంద మందికి పైగా మరణించగా, లక్షలమంది నిరాశ్రయులయ్యారు. కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలోని ప్రజలను అభ్యర్ధించారు. సెలెబ్రిటీలు ముందుకు రావాలని కోరారు.

10a 2

ఇప్పటికే కోలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు అనేక మంది తమ విరాళాలను ప్రకటించారు. ఇంకా ప్రకటిస్తూనే ఉన్నారు. కేరళను ఆదుకోవాలంటే డొనేషన్ చేయమని చెప్తే సరిపోడదని.. దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో హీరో సిద్దార్ధ కేరళ డొనేషన్ ఛాలెంజ్ ను స్టార్ట్ చేశాడు. అనంతరం తాను కేరళ బాధితులకు 10 లక్షల విరాళం ఇచ్చానని, ఈ ఛాలెంజ్ లో పాల్గొని మీరు కూడా డొనేషన్‌ లు ఇవ్వాలని సిద్దార్ధ అంటున్నాడు. ఇప్పుడు ఈ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. కికి ఛాలెంజ్ లాగా కేరళ డొనేషన్ ఛాలెంజ్ కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం

10 12

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!