HomeTelugu Trendingఆ 3 సినిమాలకు.. దేశ ఆర్థిక మాంద్యానికి లింక్..!

ఆ 3 సినిమాలకు.. దేశ ఆర్థిక మాంద్యానికి లింక్..!

2 12
బోడిగుండుకు, మోకాలికి లింకుపెట్టడం అన్న సామెత తెలుసుకదా.. సరిగ్గా ఆ సామెతకు అతికినట్టుగా మాట్లాడారు కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్. సినిమా కలెక్షన్లకు, ఆర్థిక మాంద్యానికి ముడిపెట్టారు రవిశంకర్‌ ప్రసాద్‌. అక్టోబర్‌ 2న విడుదలైన 3 సినిమాలు రూ.120 కోట్ల వసూళ్లు రాబట్టడంతో ఇక దేశంలో ఆర్ధిక మాంద్యం ఎక్కడుంది అంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకే కావాలని నిలదీశారు.

అక్టోబర్‌ 2న సైరా, వార్‌, జోకర్‌ .. మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాలు కలిపి రూ. 120 కోట్ల వసూళ్లు రాబట్టాయి. ఆర్ధికమాంద్యం గురించి తనను ప్రశ్నించిన విలేకరులకు ఈ కలెక్షన్ల లెక్కలు చెబుతూ.. దేశంలో సంక్షోభాలు లేవని.. సుభిక్షంగానే ఉందన్నారు రవిశంకర్‌ ప్రసాద్‌. సర్కార్ చెబుతున్న మాటలకు… దీంతో.. ఆ సర్కార్‌ను నడిపించే నేతల చేతలకు ఎక్కడో లింకు కట్ అవుతోందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu