అఘోరగా బాలయ్య .. క్లారిటీ ఇచ్చిన బోయపాటి

హీరో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో కనపడనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై బోయపాటి క్లారిటీ ఇచ్చాడు. ఆ వార్తలు నిజమేనని, తన తదుపరి సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించనున్నారని ప్రకటించారు. ఈ కొత్త సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.

కరోనా విజృంభణతో లాక్‌డౌన్‌ విధించడంతో ఈ సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. బాలయ్య ఫ్యాన్స్‌కు మరోసారి మంచి సినిమా అందిస్తానని బోయపాటి అన్నారు. కాగా, ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. అందులో ఓ పాత్రే అఘోరా అని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య కవలలుగా రెండు పాత్రల్లో నటిస్తున్నారని, చిన్నతనంలోనే వారిద్దరు విడిపోయి ఒకరు వారణాసిలో, మరొకరు అనంతరపురంలో పెరుగుతారని ఇటీవల ప్రచారం జరిగింది. కాగా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో సింహా, లెజెండ్ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి.