పవన్ సరైనోడుని ఎన్నుకున్నాడు!

ఈ మధ్య కాలంలో యంగ్ హీరోలు విలన్ అవతారాలు ఎత్తడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ వరుసలో ముందున్న హీరో ఆది పినిశెట్టి. సరైనోడు సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన ఆదికి ఇప్పుడు జాక్ పాట్ తగిలిందని చెబుతున్నారు. ప్రస్తుతం నిన్ను కోరి, శమంతకమణి వంటి సినిమాల్లో నటిస్తోన్న ఆదికి పవన్ కల్యాణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది.

పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో ఓ కీలకపాత్ర కోసం ఆదిని ఎంపిక చేసుకున్నారు. పవన్ సినిమాలో అవకాశం రావడంతో ఆది వెంటనే అంగీకరించాడని సమాచారం. ఏప్రిల్ 6 నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో పవన్ కు జోడీగా కీర్తి సురేష్ కనిపించనుంది. అలానే అను ఎమ్మాన్యూయల్ మరో హీరోయిన్ గా నటించనుంది.